బెంగళూరు/శివమొగ్గ : మాజీ ప్రధాని హెచ్.డి. దేవగౌడ సతీమణి చెన్నమ్మ శనివారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో అసౌకర్యం, వయో సంబంధిత ఇతర సమస్యలతో ఆమె బుధవారం రాత్రి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయంత్రం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురై మరణించినట్లు ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. హోలెనరసీపూర్ తాలూకాలోని ముట్టిగే హియహళ్లిలో జన్మించిన చెన్నమ్మకు, దేవగౌడకు 1954 మే 25న వివాహమైంది. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, అనేకమంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. ఆదివారం నాడు హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో చెన్నమ్మకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.








కామెంట్‌లు (0)