శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చివరిచూపు నోచుకోని వారికోసం అంత్యక్రియలు ప్రత్యక్ష‍ ప్రసారం

14 నవంబర్, 2026

live
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కోజికోడ్‌ కార్పొరేషన్‌ చొరవ

తిరువనంతపురం : సుదూర ప్రాంతాల్లో ఉంటూ వివిధ కారణాలతో తమ ఆత్మీయుల అంత్యక్రియలకు హాజరుకాలేక..చివరిచూపునకు నోచుకోని ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని కేరళంలోని కోజికోడ్‌ కార్పొరేషన్‌ వినూత్న నిర్ణయం తీసుకుంది. మావూర్ రోడ్‌లోని కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న 'స్మృతిపథం' శ్మశానవాటికలో అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం నాడు కోజికోడ్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి స్వప్న వివరించారు. ప్రయాణ పరిమితులు, వీసా సంబంధిత సమస్యలు, సమయాభావం కారణంగా తమ వారి దహన సంస్కారాలకు రాలేని వారి కోసం ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. ‘గ్యాస్ ఆధారిత దహన సంస్కార వ్యవస్థను ఉపయోగించి నిర్వహించే అంత్యక్రియలకు తొలుత ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక బుకింగ్ అవసరం. లైవ్ స్ట్రీమింగ్ సౌకర్యాన్ని మృతుడి సన్నిహిత బంధువులకు మాత్రమే అందిస్తాం. ఇందుకోసం రిజిస్టర్ చేసుకున్న కుటుంబ సభ్యులకు లింక్, యాక్సెస్ వివరాలు ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా పంపుతాం. తద్వారా వారు ఎక్కడున్నా తమ వారి అంత్యక్రియలను వీక్షించొచ్చు’ అని ఆమె తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్