శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో బాలికపై సామూహిక లైంగికదాడి.. హత్య

12 గంటల క్రితం

rape
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 02:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కుళ్లిన స్థితిలో మృతదేహం.. కుక్కలు పీక్కుతిన్న దారుణం

- నలుగురు నిందితుల అరెస్టు

- బిజెపి పాలనలో గాలిలో దీపంలా మహిళల భద్రత

​న్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వ పాలనలో దేశ రాజధానిలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో 16 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి, హత్యకు సంబంధించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ పరిధిలో స్వరూప్ నగర్ ప్రాంతంలో బాలిక మృతదేహం తీవ్రంగా ఛిద్రమైన స్థితిలో లభ్యమైంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 13 ఉదయం కుషక్ రోడ్డులోని జైపాల్ రాణా ఫామ్‌హౌస్ దగ్గర ఉన్న బహిరంగ ప్రదేశంలో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోవడంతో తొలుత మృతురాలి ఆడ, మగ అనేది కూడా నిర్ధారించలేకపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహంలోని కొన్ని భాగాలను వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఒక చేయి శరీరం నుంచి విడిపోయి కనిపించింది. దీంతో మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్