తిరువళ్లూర్ : ఇటీవల తిరువళ్లూర్ జిల్లాలో సీ ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్ కేంద్రంలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయిన ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 11కి చేరింది. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమెను ఒడిశాకు చెందిన రీటా జువాంగాగా ధృవీకరించారు. సీఫుడ్ ప్రాపెసింగ్ యూనిట్‌లో జరిగిన ఈ ఘటన వల్ల 67 మంది గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. వీరిలో 64 మంది మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. 16 మంది వెంటిలేటర్ సహాయంతో ఉండగా, 21 మంది నాసల్ ఆక్సిజన్‌ను అందుతోందని, 30 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ప్రకటన వెల్లడించింది. వెల్లడించింది.
కాగా, ఇప్పటివరకు ఏడుగురి మృతుదేహాలను విమానం ద్వారా ఒడిశాకు తరలించారు. మిగిలిన నలుగురి మృతదేహాలను, చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత తగిన సమయంలో తరలిస్తామని తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది.









కామెంట్‌లు (0)