ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మధ్యాహ్న భోజన బియ్యం విక్రయించిన ప్రిన్సిపల్‌ సస్పెన్షన్‌

11 అక్టోబర్, 2026

patna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 12:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాట్నా : మధ్యాహ్న భోజన పథకం కోసం కేటాయించిన బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విచారణ చేపట్టిన అధికారులు శనివారం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తూర్పు చంపారన్‌ జిల్లా భవానీపూర్‌లోని ప్రభుత్వ బేసిక్‌ స్కూల్‌ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు సునీల్‌ కుమార్‌ శ్రీవాస్తవపై వచ్చిన ఆరోపణలను అక్టోబర్‌ 7న జిల్లా విద్యాశాఖ అధికారి నివేదించినట్లు ముజఫర్‌పూర్‌లోని తిర్హుత్‌ డివిజన్‌ ప్రాంతీయ విద్యాశాఖ ఉప సంచాలకుడు సమర్‌ బహదూర్‌ సింగ్‌ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని విక్రయించడం, రిజిస్టర్‌లో నమోదైన పరిమాణం కంటే ఎక్కువ బియ్యం నిల్వ ఉండటం, పాఠశాల ఆవరణలో నిద్రించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.

అక్టోబర్‌ 8న ప్రధానోపాధ్యాయుడికి నోటీసు జారీ చేసి, 24 గంటల్లోగా ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఆయన అక్టోబర్‌ 10న సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో శ్రీవాస్తవను తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెండ్‌ చేసినట్లు సమర్‌ బహదూర్‌ సింగ్‌ తెలిపారు. ఆయనపై తదుపరి క్రమశిక్షణా చర్యలు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్