మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. పూణెలో సురక్షిత ల్యాండింగ్

15 నవంబర్, 2026

indigo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 03:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : పూణె నుంచి గువహటికి బయలుదేరిన ఇండిగో విమానంలో ఆదివారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తిరిగి పూణె విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ గేర్ వెనక్కి వెళ్లకపోవడంతో పైలట్ అప్రమత్తమై ఏటీసీకి సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.

192 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ 0623 (వీటీ-ఐజెడ్‌ఈ)లో ఈ సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న పూణె విమానాశ్రయ అధికారులు ఏటీసీ, ఇండిగో, ఇతర సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకున్నారు. భారత వైమానిక దళం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, ఇతర అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు. ల్యాండింగ్ గేర్‌ను పరిశీలించేందుకు విమానం రన్‌వేపై తక్కువ ఎత్తులో ప్రయాణించింది. అనంతరం ఉదయం 9.04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. అత్యవసర విధానాల్లో భాగంగా మూడు అగ్నిమాపక వాహనాలు, రెండు అంబులెన్సుల సహాయంతో విమానాన్ని బే నంబర్ 7కు తరలించారు. ఉదయం 9.10 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నారు. విమానంలోని ప్రయాణికులంతా క్ష‍ేమంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులు గువహటికి చేరుకునేందుకు బెంగళూరు నుంచి పూణెకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్