ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. సోమవారం 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో సందేశం పోస్టు చేశారు. "తమిళనాడు ముఖ్యమంత్రి తిరు సి. జోసెఫ్ విజయ్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను" అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా, గత నెల మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.









కామెంట్‌లు (0)