సెక్షన్ 108 కింద ఆదేశాలు జారీ చేయాలి
ఇఇఎఫ్‌ఐ డిమాండ్
న్యూఢిల్లీ : హర్యానా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. గురుగ్రామ్, నువాలకు సమాంతర విద్యుత్ పంపిణీ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ ఈ నెల 19న హెచ్‌ఇఆర్‌సి జారీ చేసిన ఉత్తర్వులను నిరసిస్తూ మూడు రోజుల సమ్మె జరుగుతోంది. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఉద్యోగుల సమాఖ్య ఇఇఎఫ్‌ఐ అభినందనలు తెలిపింది. విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 108 కింద తక్షణమే విధానపరమైన ఆదేశాలు జారీ చేయాలని ఇఇఎఫ్‌ఐ, హర్యానా ప్రభుత్వాన్ని కోరింది. సమాంతర విద్యుత్ పంపిణీని అనుమతించబోమంటూ ముఖ్యమంత్రి హామీ ఇస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. లైసెన్స్‌పై స్టే ఇవ్వాలని, సమాంతర విద్యుత్ నెట్‌వర్క్‌లకు అనుమతులు ఇవ్వకుండా నిలుపుచేయాలని కోరింది. ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీని కాపాడు కునేందుకు సాగుతున్న పోరాటానికి మద్దతుగా సంఘీభావ చర్యలను ముమ్మ రంగా చేపట్టాలని విద్యుత్ ఉద్యోగుల సంఘాలకు ఇఇఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.








కామెంట్‌లు (0)