ముంబయి : ముంబయిలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ముంబయికి, థానే జిల్లాలకు జూలై 4,5,6 వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం థానే జిల్లా, కల్యాణ్-డోంబివ్లీ మున్సిపల్ పరిధిలోని స్కూల్స్‌కు, కాలేజీలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలకు వంతెనలు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా.. లోయర్ సియాంగ్‌లోని రోట్టే, రామే, లోగ్లు, లిపిన్, మానే, టెనే, సిపు, కాక్కి, కడు, రినా, సిడో, కోరాంగ్ ప్రాంతాల్లో రోడ్లను పరిపాలనాధికారులు బ్లాక్ చేశారు.
ముంబయిలో భారీ వర్షాలు.. థానేకి రెడ్ అలర్ట్ : ఐఎండి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 11:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)