సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మురసు తుఫాను: చెన్నై, తిరువళ్లూరులో పాఠశాలలు, కళాశాలలకు సెలవు

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 07:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాను తీవ్ర తుఫానుగా బలపడటంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ముందుజాగ్రత్త చర్యగా చెన్నై, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో సోమవారం (నవంబర్ 2) పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను గత ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. నవంబర్ 3వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, నర్సాపూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించింది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు, చెన్నైలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జి.ఎస్. సమీరన్ రిపన్ బిల్డింగ్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో నగరవ్యాప్త పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, తుఫాను ప్రభావంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్