న్యూఢిల్లీ : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని, దీనిపై కోర్టు అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో యాజమాన్యం, ఢిల్లీ పోలీసులు కలిసి తమ కదలికలను నియంత్రిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది చట్ట విరుద్ధమైన నిర్బంధం అని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వీఎంఎంసీ-సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తమ కదలికలను పూర్తిగా నియంత్రిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. కనీసం కుటుంబ సభ్యులను కూడా సరిగ్గా కలవనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స పేరుతో ఆసుపత్రిలో ఉంచిన ఈ విధానం పూర్తిగా చట్టవిరుద్ధమైన నిర్బంధం కిందకే వస్తుందని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సఫ్దర్‌జంగ్ నుండి వాంగ్‌చుక్‌ను తక్షణమే విడుదల చేసి, కుటుంబ సభ్యులు కోరుకున్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆమె కోరారు. జూన్ 28న జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన ఈ నిరవధిక నిరాహార దీక్ష 21 రోజులు దాటడంతో వాంగ్‌చుక్ అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ హైకోర్టు మునుపటి ఆదేశాలు, వైద్యుల హెచ్చరికల నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆయన్ను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిజెపి (CJP) ఆధ్వర్యంలో జూన్ 6 నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్‌పై ఉన్నా వాంగ్‌చుక్ తన నిరసనను విరమించలేదు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)