- కొనసాగుతున్న విద్యార్ధుల నిరసనలు
రాంచి : ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు జరుపుతున్న విద్యార్ధి ప్రతినిధులతో జార్ఖండ్ ప్రభుత్వం జరుపుతున్న రెండో దఫాలు చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. దీంతో విద్యార్థులు తమ నిరసనలను యధావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించారు. రెండో దఫా చర్చలు శనివారం ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. విద్యార్ధుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం విందని, తమ నిరాహార దీక్ష కొనసాగించాలా వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ప్రభుత్వం అధికారికంగా ఏం చెబుతోందో వేచి చూస్తామని విద్యార్ధులు చెప్పారు.
జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి అభ్యర్ధి న్యాయ్ మంచ్‌కి చెందిన మంది సభ్యుల ప్రతినిధి బృందం నిరాహార దీక్ష జరుగుతున్న జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుండి ఉదయం 10.30కే బయలుదేరి సమావేశం జరిగే గెస్ట్‌హౌస్‌కు చేరుకుంది. చర్చలు ఉదయం 11.30కి ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి ప్రభుత్వం మరో అభ్యర్ధి వేదిక అయిన జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి రిఫార్మ్ మంచ్‌తో చర్చలు జరిపిన నేపథ్యంలో వారు చేసిన డిమాండ్లనే ఈ ప్రతినిధి బృందం కూడా మరోసారి ప్రస్తావించింది. ఇవి కాకుండా వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆందోళన చెందుతున్న పలు ఇతర డిమాడ్లను కూడా ప్రస్తావించింది. ప్రభుత్వం తరపున చర్చల్లో సుదివ్య కుమార్ సోను (జెఎంఎం), చామ్రా లిండా(జెఎంఎం), దీపికా సింగ్ పాండే (కాంగ్రెస్), సంజయ్ యాదవ్ (ఆర్‌జెడి) పాల్గొన్నారు. సమావేశానంతరం సుదివ్య కుమార్ సోను మీడియాతో మాట్లాడారు. ఆందోళనలు పరిష్కరించేందుకు వీలుగా విద్యార్ధులు, అభ్యర్ధుల సూచనలు, అభిప్రాయరాలను ఇ మెయిల్ ద్వారా ప్రభుత్వానికి పంపాలని కోరారు. ముఖ్యమంత్రితో ఈ అంశాలన్నీ చర్చిస్తామని వారు చెప్పారని, వారి నిర్ణయం విన్న తర్వాతనే తాము ఆందోళనలు, నిరాహార దీక్షపై నిర్ణయం తీసుకుంటామని విద్యార్ధి ప్రతినిధి చందన్ రజక్ తెలిపారు. ఇదిలా వుండగా జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరసన కొనసాగుతోంది. నిరాహార దీక్షలో వున్న ఇద్దరు విద్యార్ధుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. కాగా ఈ నెల 10న అసెంబ్లీ ఘెరావ్‌కు ఈ రెండు సంస్థలకు చెందిన విద్యార్ధులు సమాయత్తమవుతున్నారు.
సిజెపి మద్దతు
జార్ఖండ్ విద్యార్థుల నిరసనలకు అన్ని విధాలా సంపూర్ణ మద్దతు ఉంటుందని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ప్రకటించింది. ముఖేశ్, అక్షయ్ షిండేతో కూడిన బృందం జార్ఖండ్‌లో చేరుకొని అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు.








కామెంట్‌లు (0)