న్యూఢిల్లీ : ‘ఓట్ చోరీ’ పై నిరసనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై చర్చ చేపట్టేందుకు నిర్ణయించిన ఇండియా బ్లాక్ నేతల వర్చువల్ సమావేశం వాయిదా పడింది. గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరగాల్సి వుంది. అలాగే నవంబ ర్ 1న ఢిల్లీలో ఇండియా బ్లాక్ ర్యాలీకి సంబంధించి కూ డా సమీక్ష చేపట్టాల్సి వుంది. అయితే ఈ సమావేశం వాయిదా పడిందని సంబంధిత వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తదుపరి సమావేశం తేదీ గురించి వివరాలు తెలియాల్సి వుందని పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేయడం కోసం, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి ప్రభుత్వం పార్లమెంటును సమావేశపరచనుందనే ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గతవారం ఓట్‌చోరీని వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా బ్లాక్ నేతలు సహా పలువురు కార్యకర్తలు, ప్రజా సంఘాలు మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)