న్యూఢిల్లీ : సిఇసి జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ ప్రతిపాదించిన ‘అభిశంసన’ను శనివారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. న్యూఢిల్లీలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్లు ఇండియా బ్లాక్ తెలిపింది. పార్టీలోని సీనియర్ నేతలు ఇబ్బంది పడవచ్చనే నిర్ణయంతో ఏకాభిప్రాయంతో వాయిదా నిర్ణయం తీసుకున్నామని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో ఎస్‌ఐఆర్ ద్వారా జరిగిన అవకతవకలపై తాము ప్రతిపాదించిన ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమం పార్లమెంటును ఎగతాళి చేస్తున్నట్లు లేదా ఆ వ్యవస్థను కించపరుస్తున్నట్లు భావించే దృశ్యాలకు తావివ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. నవంబర్ 1న జరగనున్న ఇండియా బ్లాక్ ర్యాలీ గురించి మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇతర రాష్ట్రాల ప్రజలు ఢిల్లీకి రాకుండా అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీకి వేలాదిగా ప్రజలు హాజరవుతారని అన్నారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, ఆవేదన నెలకొన్నాయని పేర్కొన్నారు. లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోతున్నారని, అదానీ, అంబానీ, ప్రధాని మోడీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజల ఓట్లను దొంగిలిస్తున్నారని విమర్శించారు. నవంబర్ 1న జరిగే ర్యాలీ ఒకే కార్యక్రమమని, దీనిని వేర్వేరు నిరసన కార్యక్రమాలుగా నిర్వహించే ఉద్దేశం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
సిఇసి జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన శనివారానికి వాయిదా : ఇండియా బ్లాక్
30 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)