ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రియాద్‌ విమానాశ్రయంపై దాడిని ఖండించిన భారత్‌

14 గంటల క్రితం

Riyadh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 01:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : రియాద్‌లోని సౌదీఅరేబియా కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం జరిగిన దాడిని భారత్‌ ఖండించింది. పౌరులు, మౌలిక సదుపాయాలపై పదేపదే జరుగుతున్న దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, తక్ష‍ణమే నిలిపివేయాలని పేర్కొంది.

గత కొన్ని రోజులుగా రియాద్‌లోని కింగ్ ఖలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరుగుతున్న పునరావృత దాడులను, ముఖ్యంగా అక్టోబర్ 10న జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగాయని పేర్కొంది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రకటన పేర్కొంది. సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో సౌదీ అరేబియా ప్రజలకు, ప్రభుత్వానికి మేము సంఘీభావం తెలుపుతున్నామని తెలిపింది. ఈ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు రావాలని ఆశిస్తున్నామని ఆప్రకటన వెల్లడించింది.


ఈ దాడికి హౌతీలే కారణమని మిలిటెంట్లే కారణమని సౌదీ అరేబియా ఆరోపించింది. సౌదీలోని విమానాశ్రయంపై జరిగిన దాడిలో మృతుల సంఖ్య 12కి చేరింది. సుమారు 300మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్