మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైజాకర్ల నుండి మత్స్య నౌకను రక్షించిన భారత నేవీ

11 గంటల క్రితం

Indian Navy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 12:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : సోమాలియా ఈశాన్య తీరంలో సాయుధ సముద్రపు దొంగలు హైజాక్‌ చేసిన మత్స్య నౌక ‘అజిని’ని భారత నేవీ విజయవంతంగా రక్షించింది. 48 గంటలకు పైగా సాగిన ఆపరేషన్‌లో నౌకలోని 20 మంది సిబ్బందిని సురక్షితంగా విడిపించింది. గత నెల ప్రారంభంలో సాయుధ సముద్రపు దొంగలు ఈ మత్స్య నౌకను హైజాక్ చేసినట్లు భారత నౌకాదళం తెలిపింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై మరిన్ని దాడులు చేసేందుకు దీనిని ‘మదర్‌షిప్‌’గా ఉపయోగించుకోవాలని భావించారని, ఇది సముద్ర భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది.

వివరాల ప్రకారం.. హైజాక్‌కు గురైన నౌకను గుర్తించి, దాని కదలికలను పర్యవేక్షించేందుకు సముద్ర నిఘా విమానం సహకారంతో యుద్ధనౌకను రంగంలోకి దింపింది. నిరంతర నిఘా అనంతరం నౌకను అదుపులోకి తీసుకునేందుకు, దొంగలు తప్పించుకోకుండా నిరోధించేందుకు పకడ్బందీ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం నుండి మెరైన్ కమాండోలను నౌకపైకి దించారు. కమాండోలు వేగంగా వ్యూహాత్మక చర్యలు చేపట్టి నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సముద్రపు దొంగల ముప్పును తొలగించి, నౌకలోని 20 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్