ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నేటి యుగంలో సామ్రాజ్యవాదం’ అంశంపై వ్యాసాలకు ఆహ్వానం

3 రోజుల క్రితం

‘నేటి యుగంలో సామ్రాజ్యవాదం’ అంశంపై వ్యాసాలకు ఆహ్వానం
- సీతారాం ఏచూరి ఫౌండేషన్ (ఎస్‌వైఎఫ్) ప్రకటన
​- దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవకాశం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 01:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​- సీతారాం ఏచూరి ఫౌండేషన్ (ఎస్‌వైఎఫ్) ప్రకటన

​- దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవకాశం

న్యూఢిల్లీ: సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జ్ఞాపకార్థం ఏర్పాటైన సీతారాం ఏచూరి ఫౌండేషన్ (ఎస్‌వైఎఫ్), ‘నేటి యుగంలో సామ్రాజ్యవాదం’ అనే అంశంపై వ్యాసాలను (అబ్‌స్ట్రాక్ట్‌లు) ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పిజి విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు అని ఫౌండేషన్ తెలిపింది. ఈ వ్యాసాలను అక్టోబర్ 26 సాయంత్రం 5 గంటలోపు పంపాలి. ఆ తర్వాత వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ఎస్‌‌వైఎఫ్‌ ‌తెలిపింది. ఈ ట్రస్టుకు ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ అధ్యక్షులు కాగా, ఏచూరి భార్య, పాత్రికేయురాలు సీమా చిష్టి కార్యదర్శిగా ఉన్నారు, అలాగే, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, చెన్నైలోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఛైర్మన్ శశి కుమార్, ఆర్థికవేత్త సిపి చంద్రశేఖర్ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.

ఎంపిక విధానం

​ ఎస్‌వైఎఫ్ ఏర్పాటు చేసిన కమిటీ ఎనిమిది ఎంట్రీలను ఎంపిక చేస్తుంది. ఎంపికైన రచయితలు తమ అబ్‌స్ట్రాక్ట్‌ల ఆధారంగా 3వేల పదాలతో వ్యాసాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏచూరి స్మారకార్థం నవంబర్ 22న ఎస్‌వైఎఫ్ కోల్‌కతాలో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎంపికైన విద్యార్థులు ఈ వేదికపై తమ వ్యాసాలను సమర్పిస్తారు. అయితే, కోల్‌కతా వెళ్లి రావడానికి ప్రయాణ ఖర్చులు, అక్కడ బస ఏర్పాట్లను ఫౌండేషనే చూస్తుంది. ఆసక్తి ఉన్నవారు తమ వ్యాసాలను syfessays@gmail.com చిరునామాకు పంపాలని ఫౌండేషన్ కోరింది. సందేహాలుంటే అదే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చుని తెలిపింది. యువతలో ప్రగతిశీల, లౌకిక భావాలు, ఆదర్శాల పట్ల అవగాహనను పెంచడం, వాటిని వ్యాప్తి చేయడమే తమ లక్ష్యమని ఫౌండేషన్ తెలిపింది. యువత చురుకైన భాగస్వామ్యంతో, వారిని కేంద్రంగా చేసుకుని విద్యా, ప్రజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్నామని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్