న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసుల నుంచి తప్పించుకుంటూ చేతిలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జెండాతో ముందుకు దూసుకు వెళుతున్న ఒక విద్యార్థిని ఫోటోను సిపిఐ(ఎం) ఎంపి జాన్ బ్రిట్టాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది పోలీసుల నుండి పారిపోవడం కాదని... ఉద్యమ స్ఫూర్తిని రగిలించడమని ఆయన ఆపోస్ట్లో జోడించారు. ఆ ఫోటోలో ఉన్న విద్యార్థిని పేరు పవిత్ర. కేరళలోని పాలక్కాడ్ జిల్లా మంకరకు చెందిన ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ చదువుతున్నారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవిత్ర, ఢిల్లీలో జరిగిన నిరసనలో ఎస్ఎఫ్ఐ జెండాతో ముందుకు సాగిన దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. ఈ దృశ్యం విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటున్న యువత దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోందని ప్రశంసించారు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, అణచివేతకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించేందుకు ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసుల బెదిరింపులకూ వెనుకాడకుండా నిరసనల్లో పాల్గొంటున్న యువతలో పవిత్ర కూడా ఒకరు. ఆమె ప్రదర్శించిన ధైర్యం విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. “ఇది పలాయనం కాదు.. ముందుకు దూసుకెళ్లడం!” అని జాన్ బ్రిట్టాస్ సహా పలువురు ఆమెను అభినందించారు.
‘‘ఇది పలాయనం కాదు.. ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం ’’
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)