న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం (ఇసి) తీరును నిరసిస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ‘జైల్ భరో ఆందోళన’ను చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. బుధవారం ముంబయి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసి పనితీరు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు. ఇసి తీరుకు విమర్శిస్తూ గాంధీ జయంతి రోజున ముంబయిలోని శివాజీ పార్క్ నుండి ‘‘జైల్ భరో ఆందోళన’’ను చేపట్టనున్నామని, శివాజీ పార్క్ నుండి ఈ నిరసన ప్రారంభమవుతుందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇసి ‘‘నిరంకుశ ధోరణి’’ ఆందోళనకరమైన అంశమని, దేశంలో మార్పు తీసుకురావడానికి సమిష్టి కృషి అవసరమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎఐ దుర్వినియోగంపై ఎన్‌సిపి(ఎస్‌పి) అధ్యక్షుడు శరద్‌పవార్ చేసిన వ్యాఖ్యలకు దీప్కే మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని పునరుద్ఘాటించారు.
Print Editionఇసి తీరును నిరసిస్తూ రేపు ‘జైల్‌భరో ఆందోళన’ : సిజెపి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 02:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)