శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహాత్మా...!

1 గంట క్రితం

Gandhi-min.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 04:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మహాత్మా..మళ్లీ జన్మించు

ఏడు దశాబ్దాల తరువాత

నీ అడుగులు చెరిగి పోయే

నీ ఆదర్శాలు మాసి పోయే..!

​

వాడవాడల్లో ప్రతి సంవత్సరం

మొక్కుబడిగా నీ జయంతులను

తంతుగా మీ వర్థంతులను చేస్తున్నా

దేశంలో రామరాజ్యం రావటంలేదు..?

​

అర్థరాత్రే కాదు పట్టపగలే ఆడపిల్ల

గడప దాటితే ఇంటికి రావటం లేదు

పల్లెల్లో అభివృద్ధి లేక తల్లడిల్లుతూ

పట్టణాలకు పరుగెత్తే పట్టు కొమ్మలు..!

​

స్వర్ణ భారతావనిలో కుల మతాలు

వారసత్వపు రాజకీయ కుతంత్రాలు

గుర్రపు డెక్కల్లాగా విస్తరించి పోయీ

అభివృద్ధికి అడ్డు గోడగా ఉన్నాయి..!

​

కూడలిలో నీవు కనపడతావు అందరికి

బోసి నవ్వులను దోసెడు ఆరబోసి

బడి పిల్లలే నిన్ను గుర్తు పెట్టుకున్నారు

గాంధీ ఆశయాలు మరిచే గాంధేయులు..!

​

ఉప్పు సత్యాగ్రహంలో నిప్పు రాజేశావు

దండి యాత్రలో నీ చేతి కర్రే ఆయుధం

తెల్లవాడిని ఆయుధం చేత పట్టకుండా

అల్లాడించావు అహింసా పద్ధతులతో..!

​

భారత దేశంలో నేతలు మారినా

అప్పులు పెరిగిపోయే కుప్పలుగా

బాపూ..దేశంలో నువ్వు మళ్లీ పుట్టాలి

కుబేరుల సంపదను బయటకు తీసేందుకు

మరో సత్యాగ్రహాన్ని మీరు చేపట్టాలి...!

- జి. సూర్యనారాయణ,

సెల్‌: 6281725659


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్