శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విమానయాన భద్రతా లోపాలపై జాన్ బ్రిట్టాస్ ఆందోళన ....

21 గంటల క్రితం

John Brittas expresses concern over aviation safety lapses.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో భద్రతా లోపాలు బహిర్గతమవుతున్నా, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిపిఐ(ఎం) ఎంపి జాన్ బ్రిట్టాస్ అన్నారు. దీనికి సంబంధించి శుక్రవారం ఎక్స్ (X) వేదికగా పౌర విమానయాన శాఖ సమాధానాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం ప్రకారం, 2023 నుండి జూన్ 2026 మధ్య కాలంలో విమాన సర్వీసుల్లో ఏకంగా 2,420 ప్రధాన సాంకేతిక లోపాలు నమోదయ్యాయి. భద్రతా ఉల్లంఘనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జనవరి 2024 నుండి జూన్ 2026 మధ్య విమానయాన సంస్థలకు 382 షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. వేలాది లోపాలు, వందలాది నోటీసులు ఉన్నప్పటికీ, 2023 నుండి 2025 వరకు కేవలం 51 లోపాలపై మాత్రమే చర్య తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్స్, విమానాశ్రయాలు, నిర్వహణా సంస్థలలో పలు ఉల్లంఘనలను డిజిసిఎ కనుగొన్నప్పటికీ, ఏ సంస్థపై ఏం చర్యలు తీసుకున్నారనే వివరాలను బహిర్గతం చేయడానికి ప్రభుత్వం నిరాకరించడం ద్వారా జవాబుదారీతనాన్ని రహస్యంగా ఉంచుతోందని బ్రిట్టాస్ విమర్శించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్