మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వాంగ్‌చుక్‌ పాఠశాలకు లడఖ్ యంత్రాంగం నోటీసులు

10 గంటల క్రితం

Wangchuk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 01:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లెహ్‌ : పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్ పాఠశాలకు లడఖ్‌ యంత్రాంగం ఆదేశించింది. వాంగ్‌చుక్‌ స్థాపించిన హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అల్టర్నేటివ్‌ (హెచ్‌ఐఎఎల్‌) కు చెందిన డెసర్ట్‌ పాఠశాలలో హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. లెహ్‌లోని తహసీల్దార్ కార్యాలయం ఆదివారం నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నోటీసును హెచ్‌ఐఎఎల్ సహ వ్యవస్థాపకురాలు, సిఇఒ, వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి జె. ఆంగ్మోకు ఈ నోటీసులు పంపారు. లేహ్‌లోని డెసర్ట్ ఫ్లవర్ స్కూల్‌లో, సంబంధిత అధికారుల నుండి అవసరమైన సమ్మతి, అనుమతులు లేదా ఆమోదాలు పొందకుండానే తరగతులు, ఇతర కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని యాజమాన్యానికి సమాచారం అందినట్లు నోటీసు పేర్కొంది.

సెప్టెంబర్‌ 22న అంగ్మో పంపిన ఒక లేఖను కూడా ప్రస్తావించింది. పాఠశాల నిర్వహణ కమిటీలో ప్రతిపాదిత సభ్యులకు ‘నిరభ్యంతర పత్రం’ (ఎన్‌ఓసీ) జారీ చేయాలని సెప్టెంబర్‌ 22న అంగ్మో లేఖలో కోరినట్లు యాజమాన్యం ప్రస్తావించింది. ఈ పాఠశాల హెచ్‌ఐఏఎల్‌ వ్యవస్థలో భాగంగా నిర్వహించబడుతోంది. హెచ్‌ఐఎఎల్‌కు సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం జమ్మూ,కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టులో విచారణలో ఉందని యాజమాన్యం పేర్కొంది. న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా, హైకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు, పాఠశాల నిర్వహణకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టవద్దని లేదా కార్యకలాపాలను ప్రారంభించవద్దని హెచ్‌ఐఎఎల్‌కు, అంగ్మోకు తహసీల్దార్ సూచించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై ప్రభావం చూపేలా ఎటువంటి చర్యలు తీసుకోకుండా, యథాతథ స్థితిని (స్టేటస్‌ కో) పాటించాలని హెచ్చరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్