శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో లష్కరే తొయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ (22) బుధవారం భద్రతా దళాల కాల్పుల్లో మరణించాడు. జంగల్‌పోరాలోని ఓ మసీదులో దాక్కున్న అతడిని లొంగిపోవాలని పోలీసులు కోరారు. అయితే అతను నిరాకరించడంతో ఆపరేషన్ చేపట్టారు. మసీదు పవిత్రతకు భంగం కలగకుండా అత్యంత సంయమనంతో వ్యవహరించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. గత నవంబరు నుండి భట్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. ఇటీవల సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో దాడితో పాటు పలు దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై రూ.15 లక్షల రివార్డు కూడా ఉందని అన్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సైన్యం తెలిపింది.
పోలీసుల కాల్పుల్లో లష్కరే ఉగ్రవాది మృతి
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)