శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తమిళనాడులో లైబ్రరీ స్కామ్‌

18 నవంబర్, 2026

tv
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 06:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పబ్లిషర్‌ అరెస్టు

  • బోగస్‌ రచయితల పేర్లతో పుస్తకాలు సరఫరా చేసినట్టు అభియోగాలు

చెన్నై : బోగస్‌ రచయితల పేర్లతో తమిళనాడులో గ్రంథాయాలకు పుస్తకాలు సరఫరా చేసిన పబ్లిషర్‌‌ ఆర్. మోహన్‌ను ఆ రాష్ర్ట విజిలెన్స్ అవినీతి నిరోధక డైరెక్టరేట్ (డివిఎసి) అరెస్టు చేసింది. కొంతమంది అధికారులతో కుమ్మక్కైన మోహన్‌‌ వెబ్‌సైట్లు, చాట్‌ జిపిటి నుండి సేకరించిన సమాచారంతో బోగస్‌ రచయితల పేర్లతో పుస్తకాలను ప్రభుత్వ గ్రంథాలయాలకు సరఫరా చేసినట్లు డివిఎసి పేర్కొంది. అగల్విలక్కు పబ్లిషర్స్, ఫీనిక్స్ పబ్లికేషన్స్ అనే సంస్థలకు మోహన్‌ యజమాని. ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ రెండు సంస్థలు చెన్నైలోని మడిపాక్కంలో ఒకే చిరునామా నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాలకు అగల్విలక్కు 2,339 పుస్తకాలను, ఫీనిక్స్ 99 పుస్తకాలను సరఫరా చేసినందుకు రూ.1.74 కోట్లను ప్రభుత్వం నుంచి అందుకున్నాయి. మోహన్ నివాసాలు, సంస్థల ప్రాంగణాలతో పాటు రాణిపేట, తిరుపత్తూరు, కాంచీపురం, టెన్‌‌కాశీ జిల్లాలోని గ్రంథాలయాల్లో డివిఎసి బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నెల 15న నమోదైన ఈ కేసులో మోహన్‌తో పాటు, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్, చెన్నైలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ, కోయంబత్తూర్‌లోని పెరియార్ అరివులగం సంస్థలలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వ్యక్తుల పేర్లు ఉన్నాయి. మోహన్‌కు చెందిన ప్రచురణ సంస్థలు పంపిన పుస్తకాలను ఎలాంటి పరిశీలన లేకుండానే అధికారులు ఆమోదించారని డివిఎసి విమర్శించింది. కోయంబత్తూరు గ్రంథాలయంలోని దాదాపు 1,800 అగల్విలక్కు పబ్లిషర్స్‌‌కు చెందిన నకిలీ పుస్తకాలను ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ గుర్తించి ప్రశ్నించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న పాఠశాల విద్యా శాఖ డివిఎసి విచారణ కోరింది. ఈ నెల 10న మద్రాసు హైకోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నెల 15న ఐదుగురు గ్రంథాలయ అధికారులను రాష్ర్ట ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్