కోల్‌కతా: మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ ఘటక్ (28) ఆమె ఇంటిలో ఉరి వేసుకుని అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రాంపూర్ హట్లోని ఆమె నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బృష్టికి ఆమె భర్తతో కొంతకాలంగా విభేదాలు తలెత్తడంతో వారి మధ్య విడాకుల కేసు విచారణలో ఉందని, ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలంగా డిప్రెషన్ కు గురయ్యారని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగిన కేసులో బృష్టి ఉద్యోగం కోల్పోయారు.
మమతాబెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి
23 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)