మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతి విపత్తులతో భారీ నష్టం.. కేంద్రం ఆర్థిక సాయం అందించాలి : సిఎం చంద్రబాబు

7 గంటల క్రితం

Massive damage due to natural disasters the Centre must provide financial assistance CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 04:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎల్‌నినో ప్రభావం, వరుస తుపాన్ల కారణంగా రాష్ట్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహాయంతో పాటు రాయలసీమ అభివృద్ధికి కీలకమైన హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుపై చర్చించారు. రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన ప్రతిపాదనలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు. మరోవైపు అర్నబ్, మరుసు తుపాన్ల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టానికి సంబంధించిన సమగ్ర నివేదికను ఇప్పటికే కేంద్రానికి అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటి ప్రభావంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను వివరించారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం తగిన ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్