శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిజమైన ఓటర్ల కోసం పోరాడుతున్నాం : ఖర్గే

6 రోజుల క్రితం

INDIA bloc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 04:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఇండియా బ్లాక్‌ 'చొరబాటుదారులను' కాపాడటానికి కాకుండా నిజమైన ఓటర్ల కోసమే పోరాడుతోందని కాంగ్రెస్‌ అధ్యక్ష‍ుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న ఖర్గే నివాసంలో, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన, ఇండియా బ్లాక్ ‘బహిరంగ అభిశంసన’ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. సిఇసి జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా బ్లాక్ చేపట్టిన ఈ ప్రతీకాత్మక బహిరంగ అభిశంసన కార్యక్రమంలోఖర్గే మాట్లాడారు. ఇండియా బ్లాక్‌ 'చొరబాటుదారులను' కాపాడటానికి కాకుండా నిజమైన ఓటర్ల కోసమే పోరాడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఇసిపై ఆరు అభియోగాలను ప్రదర్శించారు. సిఇసి జ్ఞానేశ్‌ కుమార్‌ ఓట్లను దొంగిలించడానికి కుట్ర పన్నారని, 13.2 కోట్ల ఓటర్లను తొలగించారని, పార్లమెంటు ప్రమేయం లేకుండా ఫారం 6ను తిరిగి రాశారని, ఈసిఐనెట్ ద్వారా ఓటర్ల జాబితాను స్వాధీనం చేసుకున్నారని, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లను పక్కన పెట్టారని, ప్రధాని మోడీ, అమిత్ షాల ఆదేశాల మేరకు పనిచేశారని పేర్కొన్నారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 తీవ్ర ముప్పులో ఉందని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్ఞానేశ్‌ కుమార్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ‘‘ ప్రత్యక్ష ఆదేశాల’’ మేరకు ఎన్నికల కమిషన్‌ను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలల క్రితం, 193 మంది ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఉభయ సభలలో సిఇసిని తొలగించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, తమ నోటీసులను తిరస్కరించారని, వాటిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. దీంతో ఈ రోజు తాము ప్రవేశపెట్టిన తీర్మానం ఒక రాజ్యాంగ సంస్థ గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

నవంబర్ 1న సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్-కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుండి రామ్‌లీలా మైదాన్ వరకు ప్రతిపక్ష పార్టీలు 'చలో ఢిల్లీ' మార్చ్‌ చేపడతాయని లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, సిఇసి రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్‌ డిమాండ్ చేస్తుందని తెలిపారు. నవంబర్ 1న జరిగే ర్యాలీకి ప్రజలు ఢిల్లీకి రాకుండా హోం మంత్రి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని రాహుల్‌గాంధీ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్