ముంబయి : వరుసగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ముంబయి దిగ్బంధనమైంది. మూడువైపులా నీరుండే నగరం నాలుగో వైపు సంబంధాలు తెగిపోవడంతో ద్వీపంలా మారింది. ముంబయి-పుణె, ముంబయి-అహ్మదాబాద్, ముంబయి-కొంకణ్ రోడ్లన్నీ మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబయి, పుణె ఎక్స్‌ప్రెస్ వేలో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించడానికి ‘మిస్సింగ్ లింక్’ పేరుతో 13.3 కిలోమీటర్ల బైపాస్‌ను రూ.6,695 కోట్లతో నిర్మించారు. ఇందులో రెండు సొరంగాలు (1.6 కి.మీ., 8.9 కి.మీ.) ఉన్నాయి. 183 మీటర్ల తీగల వంతెన ఉంది. దీనివల్ల దూరం తగ్గేది 6 కిలోమీటర్లే అయినా ప్రయాణ సమయం 20 నుంచి 30 నిమిషాలు తగ్గుతోంది. ఈ సొరంగ మార్గాన్ని 9 వారాల కిందట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు. సోమవారం 3.30 గంటల సమయంలో సొరంగం సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. 18 గంటల పాటు శ్రమించి మార్గాన్ని పునరుద్ధరించారు.
భారీ వర్షాలతో ముంబయి దిగ్భంధనం
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 08:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)