నాగాలాండ్ : నాగాలాండ్‌లో కల్తీ మద్యం అనుమానిత ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల్లో మద్యం సేవించిన తర్వాత 19 మంది మృతి చెందారు. మొకోక్‌చుంగ్ జిల్లాలో 8 మంది, ట్యూన్‌సాంగ్ జిల్లాలో 11 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు అదనపు ఎస్పీ ఐ.బంగ్‌లాంగ్ చాంగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అనుమానిత కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది ? దాని సరఫరా వెనుక ఎవరున్నారు ? అనే కోణాల్లో సిట్ దర్యాప్తు చేపట్టింది. మద్యం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం అధికారులు గువాహటికి పంపించారు. మరణాలకు అసలు కారణం ఏంటో పరీక్షల తర్వాత స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. కొన్ని ఆధారాలు లభించాయని, అయితే దర్యాప్తు ప్రారంభ దశలో ఉండటంతో వివరాలు వెల్లడించలేమని సీనియర్ ఎస్పీ వెసుప్రా కెజో అన్నారు. మరణాల నేపథ్యంలో .... పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి 19 మందిని అరెస్టు చేశారు. దాదాపు 3 వేల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. గుర్తుతెలియని, లేబుల్ లేని లేదా అనుమానిత అక్రమ మద్యాన్ని తాగవద్దని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగిన తర్వాత తల తిరగడం, చూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు. నాగాలాండ్‌లో 1990 నుంచి మద్య నిషేధ చట్టం అమల్లో ఉంది.
Nagaland - కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 12:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)