శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈ నెల 22, 23 తేదీల్లో భారత్‌‌లో నేపాల్‌ ప్రధాని పర్యటన

20 నవంబర్, 2026

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మాండు : ఈ నెల 22, 23 తేదీల్లో భారత్‌‌లో నేపాల్‌ ‌ప్రధానమంత్రి బాలేంద్ర షా పర్యటించనున్నారు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ కార్యదర్శి అమృత్ బహదూర్ రాయ్ శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో నేపాల్‌ ‌ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాలేంద్ర షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు 34 మంది సభ్యులతో కూడిన బృందంతో బాలేంద్ర షా ఈ పర్యటనలో పాల్గొంటున్నారని అమృత్ బహదూర్ రాయ్ తెలిపారు. భారత్ - నేపాల్ మధ్య సంబంధాలపై పూర్తి స్థాయి సమీక్ష‍తోపాటు పరస్పర ప్రయోజనాలు కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సోమవారం ద్వైపాక్షిక చర్చల్లో బాలేంద్ర షా పాల్గొననున్నారని రాయ్‌ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా షా భేటీకానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్