శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విభజిత తీర్పుపై ప్రత్యేక విచారణకు నో

4 గంటల క్రితం

supreme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 10:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇసి నియామకాల కేసులో సుప్రీం

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 నాటి చట్టాన్ని సవాలు చేయడాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలా లేదా అనే అంశంపై ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పును రీకాల్‌ ‌చేయాలని కోరుతున్న పిటిషన్‌‌ను విడిగా విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. రీకాల్‌ ‌దరఖాస్తును, రిఫరెన్స్‌ ఉత్తర్వులకు ఎదురైన ఏ సవాలునైనా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించవచ్చని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, జస్టిస్‌ ‌జోమాల్యా బాగ్చి, జస్టిస్‌ ‌వి.మోహనలతో కూడిన బెంచ్‌ ‌పేర్కొంది. సిఇసి, ఇసిల నియామక చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారించడానికి ఇప్పటికే ఈ బెంచ్‌‌ను ఏర్పాటు చేశారు. భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరు రిటైరైన తర్వాత కూడా రీకాల్‌ ‌దరఖాస్తును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ‌పరిశీలించవచ్చని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌తెలిపారు. జస్టిస్‌ ‌సతీష్‌ చంద్రశర్మ వచ్చే వారం రిటైర్‌ ‌కానున్నారు. న్యాయవాది భూషణ్‌ ‌మాట్లాడుతూ, రీకాల్‌ ‌దరఖాస్తును జస్టిస్‌ ‌దీపంకర్‌ ‌దత్తా, జస్టిస్‌ ‌సతీష్‌ ‌చంద్ర శర్మలతో కూడిన ఒరిజినల్‌ ‌బెంచ్‌ ‌ముందు విచారణకు పెట్టాలని కోరారు. సెప్టెంబరు 23న ఈ బెంచ్‌ ‌స్ప్లిట్‌ ‌తీర్పును ఇచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్