న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. అమెరికా – ఇరాన్ మధ్య దాదాపు తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలికే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో బ్రెంట్ చమురు ధర ఆగస్టు తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోయింది. మంగళవారం ఉదయం జనవరి డెలివరీ కాంట్రాక్టులు ఒక దశలో 90 డాలర్ల దిగువన ట్రేడయ్యాయి. ఉదయం 5.33 గంటల ఈస్టర్న్ సమయానికి బ్రెంట్ ధర 2.65 శాతం తగ్గి 90.14 డాలర్ల వద్ద ఉండగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ధర 2.4 శాతం పతనమై 84.78 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 80 శాతానికి ధరల ప్రమాణంగా ఉన్న బ్రెంట్ ధరపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు ప్రభావం చూపాయి. ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని, ఇరాన్ తమతో చర్చలు జరుపుతోందని ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లో వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు రవాణా పునరుద్ధరణపై వస్తున్న సంకేతాలు కూడా ధరల తగ్గుదలకు తోడయ్యాయని ఐఎన్‌జి విశ్లేషకులు పేర్కొన్నారు.
Print Edition90 డాలర్ల దిగువకు చమురు
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)