ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పునర్విభజన బిల్లును వ్యతిరేకించండి

12 గంటల క్రితం

పునర్విభజన బిల్లును వ్యతిరేకించండి
అన్ని రాజకీయ పార్టీలకు, ఎంపీలకు సిజెపి విజ్ఞప్తి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అన్ని రాజకీయ పార్టీలకు, ఎంపీలకు సిజెపి విజ్ఞప్తి

న్యూఢిల్లీ : సూత్రబద్ధ వైఖరి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంట్‌ ‌సభ్యులకు కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) విజ్ఞప్తి చేసింది. సోమవారం పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశ్యపూర్వకంగా తారు మారు చేయడానికి బిజెపికి అవకాశం కల్పిస్తూ తద్వారా ఆ పార్టీకి దీర్ఘకాలిక ఎన్నికల ప్రయోజనాలు కలిగించేందుకు ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుందని హెచ్చరించింది. తగిన రక్షణలు లేకుండా, స్వతంత్ర పరిశీలన జరపకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయడమనేది బిజెపికే శాశ్వత ప్రయోజనం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పక్షపాతపూరితమైన పునర్విభజన, దశాబ్దాల తరబడి నిష్పక్షపాత ప్రాతినిధ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించింది. పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి ఏ పార్టీ లేదా రాజకీయ నేత వీలు కల్పించినా అది ప్రజా తీర్పుకు తీవ్రంగా ద్రోహం చేయడమే కాగలదని పేర్కొంది. అటువంటి అపవిత్రమైన, విలువల్లేని రాజకీయాల వల్ల యువత మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ పునర్విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి మహిళా రిజర్వేషన్‌‌ను ఒక ముసుగుగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని సిజెపి విమర్శించింది. మహిళా రిజర్వేషన్‌ ‌చట్టం ఇప్పటికే ఆమోదించబడిందని, కానీ అమలు చేయబడలేదని పేర్కొంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ సమైక్యంగా వుండాలని, ప్రజాస్వామ్య, రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తీవ్రమైన సమస్యలుగా వున్న నిరుద్యోగం, విద్య, వాయు కాలుష్యం, మహిళల భద్రత, ఓటర్ల జాబితాల నుండి పేర్ల తొలగింపు వంటి అంశాలపై పార్లమెంట్‌ ‌దృష్టి పెట్టాలని సిజెపి కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్