శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రధాని మోడి,ట్రంప్ ఫోన్ సంభాషణ

1 రోజు క్రితం

PM Modi and Trump discuss trade, defense, and energy in phone call.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 01:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వాణిజ్యం, రక్షణ, ఇంధనంపై సమీక్ష

​న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంభాషించారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇది ఫలవంతమైన చర్చ అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా పలు రంగాల్లో భారత్‌,అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఇద్దరు నేతలు సమీక్షించినట్లు మోడీ తెలిపారు. ‘‘సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’’ (కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్) మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురూ అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచ శాంతి, భద్రతను పెంపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్