శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పురాతన పుస్తకాల సంరక్షణ కూడా వారసత్వ పరిరక్షణే..

4 గంటల క్రితం

పురాతన పుస్తకాల సంరక్షణ కూడా వారసత్వ పరిరక్షణే 
కేంద్రానికి స్పష్టం చేసిన సుప్రీం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కేంద్రానికి స్పష్టం చేసిన సుప్రీం

న్యూఢిల్లీ : సంస్కృతి, వారసత్వం అనేది కేవలం ప్రాంతాలను పరిరక్షించడానికి మాత్రమే పరిమితం కారాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధానిలో 135 ఏళ్ల నాటి పురాతన సెంట్రల్‌ ‌సెక్రటేరియట్‌ ‌లైబ్రరీ వున్న లుటియన్స్‌ ‌ప్రాంతాన్ని పరిరక్షించడమే కాదని, ఆ గ్రంథాలయంలోని శతాబ్దాల నాటి పుస్తకాలను కూడా పరిరక్షించాలని జస్టిస్‌ ‌సంజయ్‌‌ కుమార్‌ ‌నేతృత్వంలోని బెంచ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘పుస్తకాలనేవి మనం ఎంతగానో ఇష్టపడే నిధి, సంపద’ అన్న న్యాయస్థానం అభిప్రాయంతో సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా, అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఐశ్వర్యా భటి ఏకీభవించారు. శాస్త్రి భవన్‌‌లోని వాటి స్థానం నుండి పుస్తకాలను తరలించబోమని ఈ నెల 16న ఇచ్చిన హామీనే ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆ పుస్తకాలకు గల సాంస్కృతిక విలువ, వారసత్వానికి గల ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించిందని మెహతా చెప్పారు. అమికస్‌ ‌క్యూరీ, సీనియర్‌ ‌న్యాయవాది హరిప్రియ పద్మనాభన్‌‌తో కలిసి కూర్చుని ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరిస్తుందని చెప్పారు. కోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడి వుంటామని స్పష్టం చేశారు.

సుమోటో ప్రాతిపదికన ఈ కేసును తాము చేపట్టామని జస్టిస్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్‌)‌ విచారణ బాధ్యత తమ బెంచ్‌ ‌పరిధిలో లేదని చెప్పారు. ఈ సుమోటో కేసును భారత ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తామని, ఆయన తగు బెంచ్‌‌కు నివేదిస్తారని తెలిపారు. అభివృద్ధి పనుల ప్రాజెక్టులో భాగంగా సెప్టెంబరు 30కల్లా లైబ్రరీని ఖాళీ చేయాలని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో న్యాయస్థానం దీన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌ ‌సమర్పించింది. ప్రతిపాదిత కర్తవ్య భవన్‌ - 4‌లో సెంట్రల్‌ ‌సెక్రటేరియట్‌ ‌లైబ్రరీకి, తులసీ సదన్‌ ‌లైబ్రరీకి స్థలం కేటాయించినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్