గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరసన భారత్‌..

1 గంట క్రితం

qwwr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 06:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏ దశాబ్దంలో ... ఏ పోరాటం ... ఎందుకోసం?

రాష్ట్రాల సరిహద్దులను పునర్నిర్మించడం నుంచి మహిళల భద్రతకు సంబంధించిన చట్టాల్లో మార్పుల వరకు — ఆధునిక భారతదేశ రూపురేఖలను నిరసనలు ఎంతవరకు ప్రభావితం చేశాయి? అధికారంలో ఉన్నవారిని భారతీయులు ఎలా ప్రశ్నించారు, ఆ నిరసనల వల్ల ఏమి మారింది? అనే అంశాలపై టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన పరిశీలన ఇది. ఎనిమిది దశాబ్దాల వార్తా ఆర్కైవ్‌లను విశ్లేషించి ఆ పత్రిక ప్రచురించిన అంశాలను ఇక్కడ ప్రచురిస్తున్నాం.

ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్నంత మాత్రాన ప్రజలు నిరసనలు తెలపడం మానరు. వాస్తవానికి, ప్రజాస్వామ్యం బలపడే కొద్దీ ప్రజలు తమ ప్రభుత్వాల నుంచి మరింత ఎక్కువగా ఆశిస్తారు. ఎందుకంటే తమ డిమాండ్లను వ్యక్తం చేసే అవకాశం వారికి ఉంటుంది. ప్రజలు దేనికోసం నిరసన వ్యక్తం చేస్తున్నారనే అంశం వారు నివసిస్తున్న దేశం గురించి అనేక విషయాలను తెలియజేస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతోంది? రాజకీయ అధికారం ఎవరి చేతుల్లో ఉంది? ఏ విధానాలు విఫలమవుతున్నాయి? ఎవరికి అన్యాయం జరుగుతోందనే భావన ఉంది?వంటి అంశాలు నిరసనల ద్వారా బయటపడతాయి. అయితే ఈ సంబంధం రెండు వైపులా పనిచేస్తుంది. ప్రభుత్వాలు.. సామాజిక మార్పులు ప్రజల డిమాండ్లను ప్రభావితం చేస్తాయి.అదే సమయంలో నిరసనలు చట్టాలను, సంస్థలను, చివరికి దేశ పటాన్ని కూడా మార్చగలవు. గత ఎనిమిది దశాబ్దాల నిరసనలను పరిశీలిస్తే, మనదేశంలో ప్రధానంగా సాగిన పోరాటాల అంశాలు ఎలా మారాయో తెలుస్తుంది. అదే సమయంలో కొన్ని సమస్యలు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదని కూడా స్పష్టమవుతుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు సంబంధించిన ఆందోళనలు ఈ చరిత్రలో ఇటీవలి చేరిన అధ్యాయాలు.



tale


table

2


table 4

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్