గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచెన్నయ్‌లో నిరసనల హోరు

4 గంటల క్రితం

చెన్నయ్‌లో నిరసనల హోరు 
- సిఇసి జ్ఞానేష్‌ రాజీనామా, ఎస్‌ఐఆర్‌ రద్దు డిమాండ్‌‌తో 
 ఇండియా బ్లాక్‌‌ భారీ ర్యాలీలు  
- నిరసనల్లో పాలుపంచుకున్న అధికార టివికె image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిఇసి జ్ఞానేష్‌ రాజీనామా, ఎస్‌ఐఆర్‌ రద్దు డిమాండ్‌‌తో ఇండియా బ్లాక్‌‌ భారీ ర్యాలీలు

  • నిరసనల్లో పాలుపంచుకున్న అధికార టివికె

చెన్నై : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (‌సిఇసి) జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ఈ ప్రక్రియ సందర్భంగా తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ ‌చేస్తూ ఇండియా బ్లాక్‌ ‌చేపట్టిన నిరసనలతో గురువారం తమిళనాడు రాష్ట్ర ‌రాజధాని నగరం చెన్నయ్‌ హోరెత్తింది. ఇండియా బ్లాక్‌ ‌ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్యమంత్రి జోషెఫ్‌ ‌విజయ్‌ ‌నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కజగం (టివికె) కూడా పాలుపంచుకుంది. ఆ పార్టీ తరపున రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి రాజ్‌‌మోహన్‌, రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి వన్నిఅరసు నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు మాణిక్యం ఠాగూర్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం, విసికె అధ్యక్షులు తిరుమవలవన్‌, ఎండిఎంకె ప్రధానకార్యదర్శి వైకో తదితరులు ఈ నిరసనలకు నేతృత్వం వహించారు. ఎస్‌ఐఆర్‌ ప్రజాస్వామ్య హక్కులకు ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టివికె నేత, విద్యా శాఖ మంత్రి రాజ్‌‌మోహన్‌ మాట్లాడుతూ తమిళనాడులో తాము అధికారంలోకి రాక ముందునుండే ఎస్‌ఐఆర్‌‌ను వ్యతిరేకిస్తూనే వున్నామని తెలిపారు. ఈ ప్రక్రియను సుప్రీం కోర్టులో సవాలు కూడా చేశామన్నారు. తమిళనాడులో 97 లక్షల మంది ఓటర్లను తొలగించారని, ఇలా తొలగింపులను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు. ప్రధానంగా దీనివల్ల తొలిసారి ఓటర్లు, మహిళలు, యువత, అణచివేతకు గురైన సామాజిక తరగతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. ఓటు హక్కులను, ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించుకునేందుకు విభిన్న రాజకీయ పార్టీలన్నీ సమైక్యంగా వుండాల్సిన అవసరం వుందన్నారు. సిపిఎం రాష్ట కార్యదర్శి పి.షణ్ముగం ఢిల్లీలో ఆందోళనకారులపై దాడులను తీవ్రంగా ఖండించారు. భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపులను ఆయన ప్రశ్నించారు. 18 ఏళ్ళు వచ్చిన ప్రతీ వ్యక్తికి ఓటు హక్కు వుండేలా హామీ కల్పించాలన్నారు. కాంగ్రెస్‌ ‌నేత మాణిక్యం ఠాగూర్‌ ‌మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను ఇండియా బ్లాక్‌ మరింతగా విస్తరింజేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలన్నింటినీ ఇండియా ఫోరం ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ఎస్‌ఐఆర్‌‌ రద్దు ఆవశ్యకతతో సమైక్యంగా పోరాడుతామని తెలిపారు. టివికె నిరసనల్లో భాగస్వామ్యమ వ్వడంతో తమిళనాడులో ఇండియా బ్లాక్‌ మరింత బలోపేతమైందన్నారు. విసికె నేత తిరుమవలవన్‌ ‌మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు జరుగుతున్న విస్తృత పోరులో నిరసన ఒక భాగమన్నారు. ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైకో మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌‌పేరుతో ఓటర్లను తొలగించడమనేది ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేయడమేనని విమర్శించారు. ఈ నిరసన ప్రదర్శన ప్రధానికి ఒక హెచ్చరిక వంటిదన్నారు. సిపిఐ రాష్ట కార్యదర్శి ఎం.వీరపాండియన్‌, ‌రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి వన్నిఅరసు, సిపిఐ(ఎంఎల్‌) ‌లిబరేషన్‌ నేత అశైతంబి, మాజీ ఎంఎల్‌ఎ, ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లిం లీగ్‌ ‌నేత మహ్మద్‌ అబూబకర్‌‌ నిరసనల్లో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్