న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం త్రుటిలో కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. యూపీలోని సుల్తాన్‌పూర్ వెళ్తుండగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఆయన కాన్వాయ్‌లోని 5 కార్లు, ఒక అంబులెన్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుండి రాహుల్‌గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. అమిత్ షాపై గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు, భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనం కాన్వాయ్‌లో ముందు ఉండటంతో, ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారు.









కామెంట్‌లు (0)