గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్నికలను బహిష్కరిస్తే*ప్రజాస్వామ్య వ్యవస్థ అంతమైనట్లే!

1 గంట క్రితం

TH18PhukanIndGIAGQL48N3jpg-1795109703358-7094_resized.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చికాగో వర్శిటీ విద్యార్ధులతో ముచ్చటించిన రాహుల్‌

చికాగో : భారతదేశ ప్రజాస్వామ్యం పవిత్రమైనదని, ఎన్నికల వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయిందని ప్రజలు గ్రహించేవరకు ఎన్నికల్లో ఓటములను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా వుందని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికలను బహిష్కరిస్తే, ఇక ప్రజాస్వామ్యం అంతమవుతుందని ఆయన అన్నారు. చికాగో యూనివర్శిటీలో విద్యార్ధులతో బుధవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థలో లోపాలు, లొసుగులు వున్నాయనే కారణాలతో ఎన్నికలను బహిష్కరించినట్లైతే ఇక దేశ ప్రజాస్వామ్యానికి స్వస్తి పలికినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అలా చేయాలనుకోవడం లేదని అన్నారు. ‘‘భారతదేశ ప్రజాస్వామ్యం చాలా పవిత్రమైనది. ఈ దేశ ప్రజాస్వామ్యంలో సమస్య వుందని చెప్పాలంటే వంద, రెండు వందలు లేదా మూడు వందల శాతం రుజువులు, సాక్ష్యాధారాలతో నేను దాన్ని రుజువు చేయాల్సి వుంటుంది. లేని పక్షంలో అది చాలా కష్టసాధ్యమవుతుంది.’’ అని ఆయన అన్నారు. ఎన్నికలను బహిష్కరించాలని ప్రతిపక్షాలు ఎప్పుడైతే కోరతాయో ఆ క్షణమే ప్రజాస్వామ్యానికి ఇక స్వస్తి చెప్పినట్లే కాగలదని అన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అంతమొందించాలని తాము భావించడం లేదని అన్నారు. ప్రొఫెసర్‌ ‌రాబర్ట్‌ ‌పాప్‌ ‌మోడరేటర్‌‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో విద్యార్ధులతో రాహుల్‌ ‌ముచ్చటించారు. ‘‘ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని దేశ ప్రజలు గ్రహించేవరకు.. ఏం జరుగుతోంది అన్నదాన్ని బహిర్గతం చేస్తూ, ఈ క్రమంలో ఎదురయ్యే దెబ్బలను ఎదుర్కొనడమే మా వ్యూహం.’’ అని రాహుల్‌ ‌చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చిన రాహుల్‌, మంగళవారం కొలంబియా వర్శిటీ విద్యార్ధులతో, బుధవారం చికాగో వర్శిటీ విద్యార్ధులతో భేటీ అయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్