న్యూఢిల్లీ : రుతుపవనాల కారణంగా ... దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నగరంలో జనజీవనం స్తంభించిపోగా, గురుగ్రామ్, ఫరిదాబాద్‌లకు భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు ఉదయం నుంచే వాన దంచుతోంది. రాజధాని సమీపంలోని ఎన్‌సీఆర్ ప్రాంతం, నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోనూ జోరువాన కురుస్తోంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకూ దాదాపు 12 విమానాలను జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ నుంచి 6E 404, IX 1462, IX 1047, AI 4308, AI 2526, IX 1236, IX 136, SG 126, AI 1814, 6E 6125, 6E 2102 and AI 2381 ఫ్లైట్స్‌ను జైపూర్‌కు దారి మళ్లించినట్టు ఢిల్లీ విమానయానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వానలు దంచుతుండగా.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరింతగా భారీ వర్షం పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణలో కూడా పెద్ద వానలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది.
Rains - ఢిల్లీలో కుండపోత వాన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)