శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలు: 5 జిల్లా పరిషత్ స్థానాలతో సహా 55 చోట్ల సీపీఎం విజయఢంకా

8 గంటల క్రితం

రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలు: 5 జిల్లా పరిషత్ స్థానాలతో సహా 55 చోట్ల సీపీఎం విజయఢంకా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జైపూర్:

రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఎర్రజెండా రెపరెపలాడింది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం (CPI-M) అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 37 జిల్లాల్లోని జిల్లా పరిషత్, పంచాయతీ సమితి స్థానాలకు ఎన్నికలు జరగగా, సీపీఎం ఏకంగా 55 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో 5 జిల్లా పరిషత్ స్థానాలు, 50 పంచాయతీ సమితి స్థానాలు ఉన్నాయి.


హనుమాన్‌గఢ్ జిల్లా పరిషత్‌లో నాలుగు, చురు జిల్లా పరిషత్‌లో ఒక స్థానాన్ని సీపీఎం గెలుచుకుంది. హనుమాన్‌గఢ్ జిల్లా పరిషత్ 13వ వార్డు నుంచి పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి సుమన్ 4,522 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అదే జిల్లాలో 11వ వార్డులో మంజు దేవి 3,230 ఓట్లతో, 31వ వార్డులో రాణి 2,089 ఓట్లతో, 15వ వార్డులో సునీత 1,582 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చురు జిల్లా పరిషత్ 36వ వార్డులో సీపీఎం అభ్యర్థి సుమన్ దేవి 758 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,275 జిల్లా పరిషత్ వార్డులు, 7,543 పంచాయతీ సమితి వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పంచాయతీ సమితి స్థానాల్లో కాంగ్రెస్ 3,400, బీజేపీ 2,031 చోట్ల విజయం సాధించాయి. జిల్లా పరిషత్ స్థానాల విషయానికి వస్తే కాంగ్రెస్ 284, బీజేపీ 164 స్థానాల్లో గెలుపొందాయి.


అక్టోబర్ 22, 28 మరియు నవంబర్ 3, 14 తేదీల్లో నాలుగు దశల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. ప్రస్తుత పాలకమండళ్ల ఐదేళ్ల పదవీకాలం వచ్చే డిసెంబర్‌తో ముగియనుంది. కాగా, నవంబర్ 25న జిల్లా ప్రముఖ్, 26న ఉప జిల్లా ప్రముఖ్ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే నవంబర్ 27న పంచాయతీ సమితి ప్రధాన్, 28న ఉప ప్రధాన్ ఎన్నికలను నిర్వహించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్