గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనాటి ఆదేశాలను పున:పరిశీలించండి

2 గంటల క్రితం

సిఇసి నియామకాలపై భిన్న తీర్పును విచారిస్తాం
-  సుప్రీం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రైవేట్‌ వర్శిటీల్లో దేశవ్యాప్త దర్యాప్తుపై సుప్రీంను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ : ప్రైవేట్‌ ‌యూనివర్శిటీలపై దేశవ్యాప్త దర్యాప్తునకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పున:పరిశీలించాలని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. సుప్రీం కోర్టు బెంచ్‌‌లో మార్పులు జరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ మేరకు కొత్త న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేసింది. ప్రైవేట్‌ ‌యూనివర్శిటీ విద్యార్ధి ఎదుర్కొన్న వ్యక్తిగత ఇబ్బంది, మొత్తంగా దేశవ్యాప్తంగా జ్యుడీషియల్‌ ‌దర్యాప్తునకు దారి తీసింది. ప్రైవేట్‌ ‌వర్శిటీల ఏర్పాటు, వాటి క్రమబద్ధీకరణ, పనితీరు, వాటికి మంజూరైన రాయితీలు వంటి అంశాలపై దర్యాప్తు జరపాలని గత బెంచ్‌ ఆదేశించింది. ఆ ఆదేశాలను పున: పరిశీలించాలని కొత్త బెంచ్‌‌ను కేంద్రం కోరింది. 2025లో విద్యార్ధి అయేష్‌ ‌జైన్‌, ఎమిటీ యూనివర్శిటీపై దాఖలు చేసిన రిట్‌ ‌పిటిషన్‌‌కు సంబంధించిన కేసు ఇది. యూనివర్శిటీ రికార్డులో తన పేరును మార్చాలని ఆమె తొలుత అభ్యర్ధించింది. అవసరమైన పత్రాలను అందజేసినా వర్శిటీ యాజమాన్యం తన అభ్యర్ధనను తిరస్కరించిందని ఆమె పేర్కొంది. సాంప్రదాయంగా హిందూ శైలిలో వుండే ‘ఖుషి’ పేరును ఆయేషాగా మార్చుకున్నందుకు యూనివర్శిటీ అధికారులు తనను వేధింపులకు గురి చేశారని, ఇబ్బందుల పాల్జేశారని ఆమె పేర్కొన్నారు. తరగతులకు హాజరు కాకుండా తనను నిషేధించారని ఆమె తెలిపారు. ఈ కేసును జస్టిస్‌ అషదుద్దీన్‌ అమనుల్లా నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ అనేక మాసాల పాటు విస్తృతంగా విచారించింది. జైన్‌ చేసిన ఆరోపణలు నేరపూరితమైన నేరాలను లేదా పౌర తప్పిదాలను ఏమైనా వెల్లడించాయా లేదా అని విచారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆ పిటిషన్‌ ‌పరిధిని మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ ‌వర్శిటీల పనితీరుపై విస్తృత దర్యాప్తునకు బెంచ్‌ విస్తరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును జస్టిస్‌ అమనుల్లా బెంచ్‌ ‌నుండి బదిలీ చేశారు. ఇప్పటికే ఈ కేసును గణనీయంగా విచారించినా ఈ ధర్మాసనం నుంచి వేరొక ధర్మాసనానికి బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంలో సీనియర్‌‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ‌విక్రమ్‌ ‌నాథ్‌ ‌నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి తాజాగా కేటాయించారు. ఈ పరిస్థితుల్లో తాజా బెంచ్‌ ‌ముందు జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌కె.ఎం.నటరాజ్‌ మాట్లాడుతూ ‌రాష్ట్రాలు ఒక్కో వర్శిటీకి 40వేలకు పైగా పేజీలతో బృహత్తరమైన నివేదికలను అందజేయాల్సి వస్తుందని పేర్కొంది. ఈ కేసులో విద్యార్ధికి అవసరమైన రిలీఫ్‌‌కు మాత్రమే పరిమితమయ్యేలా జ్యుడీషియల్‌ ‌పరిశీలనను కుదించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్