సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition15 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారం

3 గంటల క్రితం

upadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విబి గ్రామ్‌ ‌జి చట్టం కింద నిబంధనలు జారీ

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రామీణ ఉపాధి పథకం అమలులో తలెత్తే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. వికసిత్‌ భారత్‌-గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (విబి గ్రామ్‌ ‌జి) చట్టం కింద ఫిర్యాదుల పరిష్కార నిబంధనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఫిర్యాదు అందిన ఏడు పనిదినాల్లో విచారణ పూర్తి చేసి, 15 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులో పరిష్కారం కాని ఫిర్యాదులను తదుపరి ఉన్నతస్థాయి అధికారులకు పంపించనున్నారు.

మూడు అంచెల్లో ఫిర్యాదుల పరిష్కారం

గ్రామ పంచాయతీ, బ్లాక్‌, జిల్లా స్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా స్థాయిల్లో నియమితులైన ఫిర్యాదుల పరిష్కార అధికారులు ఫిర్యాదులను స్వీకరించడం, నమోదు చేయడం, విచారణ జరపడం, పరిష్కరించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో ఈ ప్రక్రియను జిల్లా ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ పర్యవేక్షిస్తారు. పథకం అమలుకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం సంబంధిత అధికారికి నేరుగా ఫిర్యాదు అందజేయడం, రసీదుతో కూడిన స్పీడ్‌ పోస్టులో పంపించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజిటల్‌ వేదికను వినియోగించడం, టెలిఫోన్‌, ప్రత్యేక హెల్ప్‌లైన్లతో ఫిర్యాదు చేయడం వంటి అవకాశాలు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే ఇతర మార్గాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించవచ్చు. గ్రామ పంచాయతీ, బ్లాక్‌, జిల్లా కార్యాలయాల్లో భౌతికంగా అందిన ఫిర్యాదులను అదే రోజు లేదా సాధ్యం కాని పక్షంలో మరుసటి పనిదినం డిజిటల్‌ వేదికపై నమోదు చేయాలి. ఫిర్యాదుదారులకు రిజిస్ట్రేషన్‌ నెంబరు, ఫిర్యాదు అందిన తేదీ, స్వీకరించిన అధికారి వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలి. ఫిర్యాదు ఏ భాషలో ఉన్నా, ఏ రూపంలో సమర్పించినా, ఏ విధంగా అందించినా నమోదు చేయాల్సిందేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. విధానపరమైన లోపాలను సాకుగా చూపి ఫిర్యాదును తిరస్కరించడానికి వీల్లేదని పేర్కొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్