- మూడు వారాల్లో రెండోసారి బ్లాక్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం గత మూడు వారాల్లో రెండోసారి బ్లాక్ చేసింది. మంగళవారం తన ఖాతాను అధికారులు నిలిపివేసినట్టు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘మోడీ ప్రభుత్వం భారతదేశంలో నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఒక వారం రోజుల పాటు నిలిపివేసింది. ఆ తర్వాత అక్టోబర్ 20 (మంగళవారం)న మళ్లీ నిలిపివేసింది. పొలిటికల్ కార్టూన్లను చూసి భయపడటం మానేసేంత వరకు, ఈ 'నిరసన ఫ్రేమ్' అలాగే కొనసాగుతుంది.’ అని ఆ పోస్టులో సతీష్ ఆచార్య పేర్కొన్నారు.
కంటెంట్ తొలగింపుపై 2 లక్షలకుపైగా ఉత్తర్వులు
మార్చి నుంచి జులై మధ్య కాలంలో కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు దాదాపు రెండు లక్షల ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దాదాపు ప్రతిరోజూ 1,275 ఉత్తర్వులను జారీ చేస్తుందన్న మాట. ఇన్‌స్టాగ్రామ్‌కు అత్యధికంగా దాదాపు లక్ష బ్లాకింగ్ ఉత్తర్వులు అందాయి. ఫేస్‌బుక్‌కు 80,000, యూట్యూబ్‌కు దాదాపు 15,000 ఆదేశాలు వచ్చాయి.








కామెంట్‌లు (0)