మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నలుగురు హైకోర్టు చీఫ్‌ జస్టీస్‌ల నియామకానికి కొలీజియం సిఫార్సు

1 గంట క్రితం

SC -1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : వివిధ హైకోర్టులకు నలుగురు చీఫ్‌ జస్టీస్‌లను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్న సభ్యులుగా ఉన్న కొలీజియం అక్టోబర్‌ 26న సమావేశమై ఈ సిఫార్సులను సూచించింది. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి. సామ్‌ కోషీని ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సిఫార్సు చేసింది. గుజరాత్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మానష్‌ రంజన్‌ పాఠక్‌ను అదే హైకోర్టు చ్‌ఫీ జస్టిస్‌గా నియమించాలని సూచించింది. అదేవిధంగా, కోల్‌కత్తా హైకోర్టు జడ్జి జస్టిస్‌ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గాను, పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుధీర్‌ సింగ్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్