ఇంఫాల్ : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా మణిపూర్‌లోని కామ్‌జాంగ్ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న గ్రామంలో బుధవారం పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. చస్సాద్ గ్రామం సమీపంలో ఉన్న ఖోయికై కుకీ గ్రామాన్ని కొందరు అనుమానిత ఉగ్రవాదులు ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఇళ్లను తగులబెట్టారని పోలీసులు తెలిపారు. కుకీ, నాగా వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో, గ్రామస్తులు పారిపోవడంతో నిర్మానుష్యంగా మారిందని అన్నారు. ఎంత నష్టం జరిగింది, ఈ ఘటనకు బాధ్యులెవరు అన్నది తె లియాల్సి ఉందని అన్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుండి రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య జరిగిన జాతి ఘర్షణల్లో సుమారు 50 మందికి పైగా మరణించారు. డజన్ల కొద్దీ ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ హింసాకాండ కారణంగా ప్రభావితమైన జిల్లాల్లో తామెంగ్‌లాంగ్, నోనీ, కాంగ్‌పోక్పి, ఉఖ్రుల్ మరియు కామ్‌జాంగ్‌లు ఉన్నాయి.







కామెంట్‌లు (0)