ముంబయి : నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షులుశరద్ పవార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. గురువారం నాడు ‘డీహైడ్రేషన్’ కారణంగా ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, ఎంపి సుప్రియాసూలె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పామని, కానీ ఆయన అసలు వినరని, పనిని మరింతగా ప్రేమిస్తారని చెప్పారు. కాగా.. శరద్ పవార్ ఆసుపత్రిలో చేరడం ఈ నెలలో ఇది రెండవసారి. శ్వాసకోస ఇన్ఫెక్షన్ కారణంగా ఇదే నెల 2న ఆయన పూణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో చికిత్స తీసుకున్న సంగతి విదితమే.
మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్..
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)