బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపశ్చిమ బెంగాల్‌లో ఎన్‌కౌంటర్ల కలకలం

1 గంట క్రితం

gun-fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 11:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 24 గంటల్లో ఇద్దరు నిందితులు మృతి

​కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస ఎన్‌కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే రెండు ఎదురుకాల్పుల ఘటనల్లో ఇద్దరు నిందితులు మరణించారు. బిజెపి కార్యకర్త సుజిత్ మోండల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సమౌల్ షేక్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడు. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం సిఐడి అధికారులు అతడిని సంషేర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధూలియాన్‌కు తీసుకెళ్లగా, ఓ పోలీసు అధికారి సర్వీస్ రివాల్వర్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడని జంగీపూర్ ఎస్‌‌పి సురీందర్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో అతడు చనిపోయాడని వివరించారు. ఈ ఘటనపై సిఐడి అధికారులు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఈ ఘటనకు సుమారు 12 గంటల ముందు, ఉత్తర 24 పరగణాల జిల్లా గైఘాటాలో బాలికపై అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రహ్లాద్ దాస్ కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్