గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐడిబిఐ బ్యాంకులో 3న సమ్మె

1 గంట క్రితం

ఐడిబిఐ బ్యాంకులో 3న సమ్మె
విక్రయానికి వ్యతిరేకంగా ఆందోళన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్‌‌ను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌కు విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్‌ ‌సంఘాలు డిసెంబర్‌ 3న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ విక్రయంతో బ్యాంకు విదేశీ సంస్థ చేతిలోకి వెళ్లనుందని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐబిఇఎ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఎఐబిఒఎ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ) సంయుక్తంగా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వంతో పాటు ఎల్‌ఐసి ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంకులో 94 శాతం వాటా కలిగి ఉండగా.. అందులో 60 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్‌కు విక్రయించేందుకు ప్రతిపాదించినట్లు సంఘాలు పేర్కొన్నాయి. ఈ విక్రయంతో బ్యాంకు విదేశీ సంస్థ ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఐడిబిఐ బ్యాంకు ఏటా లాభాలు ఆర్జిస్తోందని తెలిపాయి. సుమారు రూ.3.50 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.2.50 లక్షల కోట్ల రుణాలతో మొత్తం రూ.6 లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోందని బ్యాంకు సంఘాలు తెలిపాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్