న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడిబిఐ బ్యాంకును విదేశీ పెట్టుబడిదారులకు విక్రయించే నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. నవంబర్ 2, 3 తేదీల్లో రెండు రోజులపాటు సమ్మె నిర్వహించాలని ఐడిబిఐ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. ఈ ఆందోళనకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) పూర్తి మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసి సంయుక్తంగా ఐడిబిఐ బ్యాంకులో కలిగి ఉన్న సుమారు 60 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించే నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారీ డిపాజిట్లు కలిగి, లాభాల్లో కొనసాగుతున్న బ్యాంకును విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శిస్తున్నాయి.
వరుస నిరసనలు..
ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యుఎఫ్‌బియు తన అనుబంధ సంఘాలకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 23న ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహించే ధర్నాలో బ్యాంకు సంఘాల నాయకులు పాల్గొనాలని కోరింది. అక్టోబర్ 25న సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, 30న నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్ 2న ఐడిబిఐ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని ఇతర బ్యాంకుల ఉద్యోగులకు సూచించింది.








కామెంట్‌లు (0)